యాతాకుల వేరోనిక ఇటీవల విడుదల
నేటి సాక్షి కోదాడ:
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు దంపతుల పెద్ద కుమార్తె యాతాకుల వేరోనిక ఇటీవల విడుదల చేసిన నీట్ ఫలితాల్లో ఎంబిబిఎస్ సీట్ సాధించి మండల విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది, ఎంబిబిఎస్ (డాక్టర్ )సీటు సాధించడం ప్రతి విద్యార్థికి ఒక కల అని తన కూతురు ఎంబిబిఎస్ సీటు సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు, వేరునితో మాట్లాడుతూ తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో నేను ఈ సీటు సాధించానని అన్నారు, మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు గార్ల కూతురు ఎంబిబిఎస్ సీటు సాధించడం పట్ల మండలంలో నాయకులు , అధికారులు మండల ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు.