బుగ్గారం మండల కేంద్రంలోని శ్రీ నవదుర్గ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా

బుగ్గారం( నేటి సాక్షి)అక్టోబర్ 15:

బుగ్గారం మండల కేంద్రంలోని శ్రీ నవదుర్గ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సంఘం గౌరవ అధ్యక్షుడిగా దశర్తి పూర్ణచందర్, అధ్యక్షుడిగా భారతపు రాజశేఖర్, ఉపాధ్యక్షుడిగా మాదాసు రాజేష్, ప్రధాన కార్యదర్శిగా కప్పల పోచయ్య ఎన్నికయ్యారు.అలాగే సహాయ కార్యదర్శిగా భారతపు శేఖర్, కోశాధికారిగా కప్పల మల్లేష్, సంఘ సలహాదారుడిగా మాదాసు రాజేందర్, ప్రచార కార్యదర్శిగా భారతపు గంగాధర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన కార్యవర్గం సంఘ అభివృద్ధికి, సభ్యుల ఐక్యతకు కృషి చేస్తూ, సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాలని సభ్యులు ఆకాంక్షించారు.