నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి 15
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో ప్రసిద్ధి చెందిన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగవ రోజు అమ్మవారు శాకంబరీ దేవిగా భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు అత్యంత వైభవముగా జరుగుచున్న దసరా మహోత్సవము 2026 సందర్భముగా నాలుగవ రోజు అనగా 15-10-2026 వ తేదీన శాకంబరీ దేవిగా శ్రీ బోయకొండ గంగమ్మ దర్శనం. అమ్మవారు అలంకారములో భక్తులకు దర్శనమిచ్చినారు. శ్రీ జీవన్ ప్రకాష్ & ఫ్యామిలి, పిల్లారి ఏజెన్సీస్, చౌడేపల్లి వారు ఉభయదారులుగా పాల్గొన్నారు. ఉభయదారులతో గణపతి హోమము, చండీ హోమము నిర్వహించినారు. ఈ కార్యక్రమములో దేవస్థాన ఉప కమీషనరు & కార్యనిర్వహణాధికారి J. ఏకాంబరం, దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొని వారికి తీర్థ ప్రసాదములు అందజేసి శ్రీ అమ్మవారి దర్శన భాగ్యము కల్పించినారు..అర్చకులు మూల విరాట్టుకు పంచామృతాభిషేకాలు నిర్వహించి శాకాంబరీ దేవిగా కొలువుదీర్చారు. స్వర్ణాభరణాలతో అలంకరించారు.మూలస్థానం వద్ద అమ్మవారిని కూరగాయలతో శాకాంబరీదేవిగా అలం కరించారు. అద్దాల మండపం వద్ద ప్రత్యేకంగా ఉత్సవ మూర్తిని అలంకరించి, కలశ స్థాపన చేసి ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.ఉభయదారులచే అమ్మవారి మూల మంత్రాన్ని పఠింపజేస్తూ శాకాంబదీదేవి విశిష్టతను వివరించారు. ఉభయదారులకు అమ్మవారి శేష వస్త్రాలను, తీర్థప్రసాదాలను.