డివిజన్ నూతన అధ్యక్షుడిగా

*నేటిసాక్షి గాజులరామారం*


భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 278 గాజులరామారం డివిజన్ నూతన అధ్యక్షుడిగా నియమితులైన సుంకరి సాయిప్రతాప్ ముదిరాజ్ పార్టీ ముఖ్య నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
తనపై నమ్మకంతో డివిజన్ అధ్యక్ష బాధ్యతలను అప్పగించినందుకు గాను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ కో-కన్వీనర్, మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరిలను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా శాలువాతో సత్కరించిన అగ్రనాయకులు, సాయిప్రతాప్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా డివిజన్ స్థాయిలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తగిన మార్గదర్శకత్వం అందించారు.

పార్టీ వికాసానికి పునరంకితం:

ఈ సందర్భంగా సుంకరి సాయిప్రతాప్ ముదిరాజ్ మాట్లాడుతూ... "నాపై నమ్మకం ఉంచి 278 గాజులరామారం డివిజన్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అగ్రనాయకత్వానికి, జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పెద్దల ఆశీస్సులు, నాయకుల మార్గదర్శకత్వంలో డివిజన్ పరిధిలో బీజేపీని మరింత బలోపేతం చేస్తాను. ప్రతి కార్యకర్తను కలుపుకొని పోతూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ వికాసానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను" అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు గరిగే శేఖర్ ముదిరాజ్, పట్లోళ్ల శ్రీనివాస్ రెడ్డి, రాజు యాదవ్, దమ్మని యశ్వంత్ , తెల్ల బాల్ రాజ్ లు డివిజన్ పరిధిలోని పలువురు బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు అభిమానులు పాల్గొని నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు.