ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు.

నేటి సాక్షి అక్టోబర్ 19పాములపాడు:-

తెలుగుదేశం పార్టీ పాములపాడు మండల ప్రజా పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) అభ్యర్థిగా వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మను జూటూరు, కోల్సు ఆనందాపురం గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో చర్చించి ఎంపిక చేసినట్లు నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాం నుంచి నేటి వరకు సుమారు నాలుగు దశాబ్దాలుగా టేకూరి కుటుంబం పార్టీకి, ప్రజలకు విశేష సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. వేంపెంట గ్రామ సీనియర్ నాయకుడు దివంగత టేకూరి గాండ్ల కృష్ణుడు, ఆయన సతీమణి, మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ, వారి కుమారుడు, సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు, అంతర్జాతీయ సమాజ సేవకుడు, వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి నాగేశ్వరరావు సేవలను కొనియాడారు.

వేంపెంట గ్రామం నుంచి సింగపూర్ వరకు రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా మానవత్వంతో ఈ కుటుంబం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. పేదలకు వస్త్రాల పంపిణీ, వారి పిల్లల చదువులకు ఆర్థిక సహాయం, అంత్యక్రియలకు ఆర్థిక సహకారం, పేద విలేకరులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేసిందని తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ–4 బంగారు కుటుంబాలు కార్యక్రమంలో భాగంగా భానకచర్ల గ్రామంలోని, నిరుపేద వృద్ధ దంపతులకు లక్షల రూపాయలు వెచ్చించి ఇంటిని నిర్మించి ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమానికి గుర్తింపుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు లు పంపిన బెస్ట్ సోషల్ అవార్డును రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి.ఫరూక్, నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా ల చేతుల మీదుగా టేకూరి.రామసుబ్బమ్మ అందుకోవడం జరిగింది. ఇటువంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా టేకూరి కుటుంబం అందరి మన్ననలు పొందిందన్నారు.

భారతదేశం నుంచి సింగపూర్‌కు వచ్చే వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు, ఇతరులకు ఆత్మీయ స్వాగతం పలికి, ఆతిథ్యం అందించే డాక్టర్ టేకూరి నాగేశ్వరరావు గొప్ప మనసున్న వ్యక్తి అని ప్రశంసించారు. ఆయన తల్లి టేకూరి రామసుబ్బమ్మ పాములపాడు మండలానికి టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా ఎంపిక కావడం సంతోషకరమన్నారు.

జూటూరు–1 ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమెను రాజకీయాలకు అతీతంగా, వర్గభేదాలను పక్కనపెట్టి, జూటూరు, కోల్సు ఆనందాపురం గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమ అమూల్యమైన ఓటుతో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా మండలంలోని, మొత్తం 12 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించి, టేకూరి రామసుబ్బమ్మను మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నుకునేందుకు సహకరించాలని కోరారు. మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మా జూటూరు-1 ఎంపిటిసి అభ్యర్థి టేకూరి.రామసుబ్బమ్మ ను అందరితో కలిసికట్టుగా గెలిపించుకుంటామని టిడిపి నాయకులు షేక్.అబ్దుల్ హఫీజ్, మధు శేఖర్ యాదవ్, సుంకిరెడ్డి, ముర్తుజావలి, మాజీ ఉపసర్పంచ్ సలాం భాష, బషీర్ అహమ్మద్, నజువా భాష, అన్వర్ భాష, ఖాదర్ బాషా, కొల్లాపురం గోపాలకృష్ణ, జి.గొల్ల శ్రీనివాసులు, షేక్.ఇస్మాయిల్, బలిజ శ్రీనివాసులు, పి.నాగిరెడ్డి, నాయిని మధు, నాయిని ఉపేంద్ర, నాయిని మద్దిలేటి, నాయిని పూసల కృష్ణ, అర్జున్ గౌడ్, వజీర్ భాష, ఇమ్రాన్, రాజు యాదవ్, జగన్మోహన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, బోయ లోకేష్ నాయుడు, బాలిశ్వర్, బోయ మౌలాలి, తలారి శంకర్, పిక్కిలి సురేష్ రెడ్డి, పోగు మహేష్ బాబు, బోయ నాగేష్, మధు, ఖాజా బాషా, ఇదాయతుల్లా, అబ్దుల్ జిలాని, డ్రైవర్ మా భాష, జమాల్, వలి, ఖలీల్, షేక్.షఫీ, ముర్తుజావలి, షేక్.సికిందర్ భాష, షేక్.సర్దార్ భాష, షేక్.ఇబ్రహీం, షేక్.మౌలాలి, ముర్తుజావలి, ఆటో వలి, షేక్.మన్సూర్, మున్వర్ భాష, ఇస్మాయిల్, రఫీ, ఉస్మాన్ భాష, రోఫా అబ్దుల్లా, అబ్దుల్లా, మౌలా హుస్సేన్, డ్రైవర్ ముర్తుజా, డీలర్ హుస్సేన్ సాహెబ్, పెద్దవలి, గొల్ల.వెంకటస్వామి, గొల్ల.కృష్ణయ్య, చిన్న మదిలేటి, కపిలేశ్వరం రాజు, శేఖర్ యాదవ్, గొల్ల.గోపాలు, పాశం నాగిరెడ్డి, నారాయణరెడ్డి, పారుమంచాల కృష్ణ, పూజల.వెంకన్న, బలిజ.తిరుపాలు, తెలుగు.ఎల్లకృష్ణ, చాకలి.మల్లయ్య, కందుకూరి.చంద్రపాల్, సునీల్, అమర్నాథ్, జయచంద్ర, తదితర జూటూరు, కోల్స్ ఆనందాపురం గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వాగ్దానం చేశారు.