.*నేటి సాక్షి / చౌడాపూర్.*
చౌడాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ ఆత్మగౌరవ పోరాట యోధుడు పేదల పెన్నిధి పండుగ సాయన్న 174 వ జయంతి సందర్భంగా చౌడాపూర్ మండల కేంద్రంలో ముదిరాజ్ జెండా ఆవిష్కరణ చేసి భారీ ర్యాలీతో మండల తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక ముదిరాజ్ సంఘాల నాయకులు మరియు వివిధ కుల సంఘాల నాయకులతో ప్రజాప్రతినిధులతో కలిసి పండుగ సాయన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పండుగ సాయన్న పేదలందరి నాయకుడని పేర్కొన్నారు బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ఆయన ప్రతీకగా నిలిచారని అన్నారు పేదల హక్కుల కోసం సామాజిక సమానత్వం కోసం ఆయన దొరల దోపిడీకి పెత్తందారుల అన్యాయాలకు ఎదురుండి నిలిచిన ధైర్యశాలి పండుగ సాయన్న రాజకీయ ప్రముఖులు యువకులు రైతులు విద్యార్థులు పోరాట యోధుడికి ఘనంగా నివాళులర్పించారు తుడుస్తూ ఆకలితో అలమటించే పేదలకు అండగా నిలిచి ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ప్రజావీరుడని స్మారించుకున్నారు అధికారం ఆధిపత్యం కొందరి చేతుల్లోనే ఉన్న కాలంలో ప్రశ్నించే పేదల పక్షాన నిలబడటమే నిజమైన ధైర్యం అని తన పోరాటాల ద్వారా చాటి చెప్పిన సాయన్న జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు ఆత్మగౌరవం కోసం నవత్వం ఆకలి లేని సమాజం కోసం సాగిన పోరాటానికి ప్రత్యేక అని పలువురు నాయకులు కొనియాడారు అయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు పండుగ సాయన్న ఆశయాలను స్మరించుకుంటూ సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు చౌడపూర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి కిచన్నపల్లి వివేకానంద గల్లి మీదుగా మందీపాల్ గ్రామంలో పండుగ సాయన్న జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ముదిరాజ్ నాయకులు ఎరుకలి కృష్ణయ్య బొర్ర రమేష్ కృష్ణయ్య బోయిన బాల్ రాజ్ మాసయ్య శేఖర్ పాలచెన్నయ్య తొంబ చిన్నయ్య శ్రీను నరేష్ కావలి రాజు నరసింహులు నరేష్ సింగరమోని నర్సింహులు శ్రీనివాస్ కృష్ణయ్య అంజయ్య యాదయ్య లక్ష్మయ్య హరీష్ గోపాల్ నవీన్ శ్రీశైలం చౌడాపూర్ మండల ముదిరాజ్ నాయకులు వివిధ పార్టీల నాయకులు బి శ్రీనివాస్ అశోక్ కుమార్ రాజేందర్ రెడ్డి సేవ్వ యాదయ్య బంద్యయ్య వివిధ గ్రామాల సర్పంచులు నవీన్ కుమార్ మధుసూదన్ రెడ్డి చెన్నయ్య నాగరాజు ప్రజాప్రతినిధులు ఆర్ఐ రవికుమార్ కుల సంఘాల నాయకులు మహానాడు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బి వెంకటేష్ మండల రజక సంఘం అధ్యక్షులు చాకలి యాదయ్య యాదవ సంఘం నాయకులు గూడెం రాజు తదితరులు పాల్గొన్నారు