శ్రీ సామ దామోదర్ రెడ్డిని ఘనంగా

.*నేటి సాక్షి / చౌడాపూర్.*

చౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ శంషాబాద్‌లో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశంహైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ సామ దామోదర్ రెడ్డిని ఘనంగా సన్మానించడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ సర్ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డా టి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ పాల్గొని పట్టభద్రుల ఓటరు నమోదుపై ముఖ్య విజ్ఞప్తి
నవంబర్ 2023 నాటికి లేదా అంతకుముందే డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులు తమ ఓటరు నమోదుకు అవసరమైన పత్రాలతో సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని కోరుతున్నాము
కావలసిన పత్రాలు
పాస్‌పోర్ట్ సైజు ఫొటో 1
ఆధార్ కార్డు జిరాక్స్
డిగ్రీ పట్టా సర్టిఫికెట్ జిరాక్స్
పట్టభద్రులందరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అవసరమైన వివరాలను ఎన్నికల అధికారుల వద్ద తెలుసుకోవాలని అన్నారు రాబోయే రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునివ్వడం జరిగింది