యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను కరీంనగర్ జిల్లా అలుగునూర్ చౌరస్తాలో అభిమానులు అత్యంత ఘనంగా నిర్వహించారు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ గోపు చంద్రశేఖర్ రెడ్డి, గంగా రెబల్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. చౌరస్తాలో కేక్ కట్ చేసి, భారీగా పటాకులు కాల్చి అభిమానులు, యువత తమ అభిమానాన్ని చాటుకున్నారు.

అలుగునూర్, అక్టోబర్ 23 (నేటి సాక్షి): సినీ నటుడు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలను కరీంనగర్ జిల్లా అలుగునూర్ చౌరస్తాలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రభాస్ అభిమానులు గోపు చంద్రశేఖర్ రెడ్డి, గంగా రెబల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అభిమాన హీరో పుట్టినరోజును పురస్కరించుకుని చౌరస్తాలో కేక్ కట్ చేసి, పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొరండ్ల సింగిల్ విండో చైర్మన్ గోపు తిరుపతి రెడ్డి హాజరయ్యారు. అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వీట్లు తినిపించారు. ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అభిమానుల సందడితో అలుగునూర్ చౌరస్తాలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో ప్రభాస్ అభిమానులు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, కంది అశోక్ రెడ్డి, సిల్ల అనిల్, సిల్ల ప్రవీణ్, ఎలవేని శ్రావణ్, నూనె విష్ణు, ముంజ రాకేష్, ముంజ ప్రవీణ్, దాసం అజయ్, సిరిసిల్ల చందు తదితర అలుగునూర్ అభిమానులు పాల్గొన్నారు.