అక్టోబర్ 25 నేటి సాక్షి నకిరేకల్ రామగిరి వెంకటేశ్వర్లు......//
ఉమ్మడి వరంగల్, ఖమ్మం,నల్లగొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసే దిశగా, అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బొల్లికొండ గణేష్ యాదవ్ పట్టభద్రులకు సూచించారు.
ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనాలంటే ముందుగా ఓటరుగా నమోదు చేసుకోవడం ముఖ్యమని తెలిపారు.అర్హత కలిగిన పట్టభద్రులందరూ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని, తమ స్నేహితులు,సహచర పట్టభద్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని కోరారు.
పట్టభద్రుల ఓటరు నమోదు చేసుకోవడానికి నవంబర్ 6వ తేదీ చివరి గడువు కావడంతో,ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా,ఆలస్యం చేయకుండా అర్హులైన ప్రతి పట్టభద్రుడు వెంటనే తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని *
బొల్లికొండ గణేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.ప్రజాస్వామ్య ప్రక్రియలోపట్టభద్రులందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.