సేంద్రియ పద్ధతిలో కేఎన్ ఎం 1638 వరి

అక్టోబర్ 25 నేటి సాక్షి నకిరేకల్ రామగిరి వెంకటేశ్వర్లు....//

సేంద్రియ పద్ధతిలో కేఎన్ ఎం 1638 వరి రకాన్ని ఎలాంటి పురుగు మందులు, కలుపు మందులు,క్రిమిసంహారక మందులు లేకుండా కేవలం జిప్సం, నూకలు, కంకర పొడి, అల్లం వెల్లుల్లి, లో పలి మట్టి, పై మట్టి ద్రావణం , పచ్చిమిర్చి, గోధుమలు, వడ్ల మొలకల ద్రావణం, మట్టి ఆముదం ద్రావణం, కుంకుడుకాయ రసద్రావనం, కంకరపొడి ద్రావణం స్ప్రే చేసి సేంద్రీయ పద్ధతులు కేఎన్ఎం1638 వరి సాగు చేసి పంట పండించిన రైతు సిలివేరు ప్రభాకర్ పంటపొలాన్ని కంప సాగర్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ బృందం సందర్శించి పంటపొలాన్ని పరిశీలించి రైతులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ ఎన్నో, వ్యయ ప్రయాసలకోర్చి పద్మశ్రీ చింత ల వెంకట్ రెడ్డి సేంద్రియ పద్ధతిలో పంట పండించిన రైతు సిలివేరు ప్రభాకర్ ని ప్రశంసించడం జరిగింది. రసాయనిక ఎరువులు వాడిన వరి తినడం ద్వారా అనారోగ్యాల పాలై రోగాల బారినపడి కావాల్సి వస్తుందని అందుకే ప్రతి రైతు సేంద్రీయ పద్ధతిలో సాగు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని భావితరాలకు మంచి వరి ధాన్యాన్ని అందించాలని చెప్పడం జరిగింది. రబీలో ఆరుతడి పంటలు వేసుకోవాలని చెప్పడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఆధ్వర్యంలో వ్యవసాయ పరిశోధన స్థానం కంప సాగర్ శాస్త్రవేత్తలు డాక్టర్ అనిల్ కుమార్ ,సీనియర్ శాస్త్రవేత్త వి శ్రీధర్, డాక్టర్ నళిని, హిమబిందు, మండల వ్యవసాయ అధికారి ఎండి జానీమియా, వ్యవసాయ విస్తరణ అధికారులు మోపియా, మాజీ ఎంపిటిసి ఇమ్మడిపాక లక్ష్మీ వెంకన్న, గుండ్లపల్లి లక్ష్మణరావు, గుండ్లపల్లి శ్రావణ్ కుమార్, నర్సింగ్ వెంకటేశం, పుట్ట వెంకన్న, జిల్లా జానయ్య, ఆయినాల శ్రీను, పుట్ట వెంకన్న, పంది రాములు, రైతులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.