నేటి సాక్షి కేసముద్రం :
కేసముద్రం ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా కొత్తపల్లి రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రెస్ క్లబ్ సభ్యులంతా కలిసి సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
*నూతన కార్యవర్గం వివరాలు:*
- *అధ్యక్షుడు:* కొత్తపల్లి రాములు
- *ఉపాధ్యక్షులు:* సోమారపు శ్రీరాములు, మందా విక్రమ్
- *ప్రధాన కార్యదర్శి:* కందుకూరి రాజుచారి
- *కోశాధికారి:* మిట్టగడుపుల మహేందర్
- *సహాయ కార్యదర్శి:* చెల్లమల్ల బాలకృష్ణ
- *అధికార ప్రతినిధి:* వేల్పుల రేవంత్
- *జాయింట్ సెక్రటరీ:* మరేపాక జగన్
- *ముఖ్య సలహాదారు:* బబ్బురు సతీష్
- *ప్రచార కార్యదర్శి:* బోడ ప్రశాంత్
- *కార్యవర్గ సభ్యులు:* గంధం సతీష్, చంద్రగిరి వంశీ, సతీష్, తాండూరి ఉమేష్, కాశీనాథ్, సోమారపు దినేష్
అనంతరం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొత్తపల్లి రాములును ప్రెస్ క్లబ్ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. స్వీట్లు పంపిణీ చేసి సంతోషం వ్యక్తం చేశారు. నూతన కార్యవర్గం జర్నలిస్టుల సంక్షేమం, ఐక్యత, హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.