హన్మకొండ నవంబర్ 02
నేటి సాక్షి (సందెల రాజు)
కిట్స్ వరంగల్‌లో నిర్వహిస్తు న్న రెండు రోజుల జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవం సుమ్‌శోధిని’26లో భాగంగా ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఎడ్జ్ ఏఐ, ఔత్సాహిక పారిశ్రా మికవేత్తల అభివృద్ధిపై ప్రత్యే క వర్క్‌షాప్‌లు నిర్వహించా రు. ఎడ్జ్ ఏఐ వర్క్‌షాప్‌లో కేప్రాజెక్ట్స్‌ఎక్స్‌ఎక్స్‌కు చెందిన కార్తీక్ విద్యార్థులకు ఏఐ, ఐఓటీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆధునిక సాంకేతికతలు,
వాటి అనువర్తనాలపై అవగా హన కల్పించారు. ఎన్‌ఎస్ ఐసీ హైదరాబాద్ సహకారం తో నిర్వహించిన రెండో వర్క్ షాప్‌లో జి. వాసు స్టార్టప్‌ల స్థాపన, వ్యాపార నమూనా లు, ప్రభుత్వ ఆర్థిక సహాయ పథకాలు, పరిశ్రమల ఏర్పా టుపై వివరించారు. ఈ సంద ర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక పరి జ్ఞానంతో పాటు ప్రాయోగిక నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచనలు పెంపొందించు కోవాలని సూచించారు. ఈసీ ఈ విభాగాధిపతి డాక్టర్ జి. రఘోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ఉద్యోగార్థులు గానే కాకుండా ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలుగా తీర్చిది ద్దడమే లక్ష్యమని తెలిపారు.
కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, నిర్వాహకులు పాల్గొన్నారు. సుమ్‌శోధిని’ 26లో భాగంగా రెండో రోజు పలు సాంకేతిక పోటీలు నిర్వ హించారు.