హన్మకొండ నవంబర్ 02
నేటి సాక్షి (సందెల రాజు)
ప్రజల్లో నేరాల పట్ల అవగాహ న పెంపొందించి, నేరాల నివా రణే లక్ష్యంగా వరంగల్ పోలీ స్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీ ఎస్ ఆదేశాల మేరకు హనుమ కొండ పోలీసులు ప్రత్యేక అవ గాహన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ ఇన్ స్పెక్టర్ మచ్చ శివకుమార్ బ్లూ కోల్ట్స్ సిబ్బందితో కలిసి రెడ్డి కాలనీలోని పలు ఇళ్లను సంద ర్శించి మహిళలకు, స్థానిక ప్రజలకు సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం, ఆస్తి సంబంధిత నేరాలపై అవగాహన కల్పిం చారు. ఈ సందర్భంగా ఇన్ స్పెక్టర్ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, అనుమానాస్పద లింకులు, నకిలీ ఆన్లైన్ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడిం చవద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్ కు ఫిర్యాదు చేయాలని తెలి పారు. యువత డ్రగ్స్, గంజా యి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా తల్లిదం డ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించా లని, పిల్లల స్నేహితులు, అల వాట్లు, రోజువారీ కదలికలను గమనిస్తూ వారికి మంచి చెడు లపై అవగాహన కల్పించాలని కోరారు. అదేవిధంగా కాలనీ ల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, ఇళ్ల పరిసరా ల్లో అనుమానాస్పద కదలిక లు కనిపించినా వెంటనే పోలీ సులకు సమాచారం అందిం చాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవు తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లూకోల్ట్స్ పోలీ సు సిబ్బంది పాల్గొన్నారు.