హన్మకొండ నవంబర్ 02
నేటి సాక్షి (సందెల రాజు)
వరంగల్‌లో నూతనంగా నిర్మి స్తున్న ఎంజీఎం మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సంబంధిత అధికారుల ను, నిర్మాణ సంస్థ ప్రతినిధుల ను ఆదేశించారు. ఆదివారం ఆస్పత్రి నిర్మాణ పనుల్లో భాగంగా వెలుపల కొనసాగు తున్న వివిధ అభివృద్ధి పను ల పురోగతిని కలెక్టర్ క్షేత్రస్థా యిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల వివ రాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రి నిర్మాణ పనులను నిర్ణీత గడు వులోగా పూర్తి చేసేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారుల ను ఆదేశించారు. ఈ పరిశీల నలో ఆర్అండ్బీ ఎస్ఈ
సురేష్ బాబు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ ఈ రాజ్‌కుమార్, ఆర్అండ్బీ ఈఈ దేవిక చౌహాన్, ఇతర అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.