నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి ఘనంగా నిర్వహించారు .చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారుని వీర వనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి, 2022 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి పిల్లుట్ల కనకయ్య నేడు ఆమె వర్ధంతి సందర్భంగా చిలుకూరు మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆఫీసు దగ్గర జరిపిన కార్యక్రమంలో చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా గౌరవ ఉపాధ్యక్షులు సిరాపురపు శ్రీనివాసరావు, సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ సాహెబలి గ్రామ కార్యదర్శి చిలువేరు ఆంజనేయులు,కాకతీయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ పుట్టపాక అంజయ్య ,DVM కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్ రావు కాటూరి అంకుల్,రాములు, వెంకటి, అంజయ్య , సిద్ధార్థ, రామలింగయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.