*నేటిసాక్షి, నల్లబెల్లి*
భారతీయ జనతా యువమోర్చా (BJYM) జిల్లా కార్యదర్శిగా సుధాగాని ప్రమోద్ గౌడ్ నియమించినట్లు జిల్లా బీజేవైఎం ఎర్రగొల భరత్ వీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సుధాగాని ప్రమోద్ గౌడ్ మాట్లాడుతూ.... పార్టీ నాయకత్వం తనపై నమ్మకం ఉంచి జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.తనకు అప్పగించిన బాధ్యతను పదవిగా కాకుండా బాధ్యతగా భావించి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, యువతను పెద్ద ఎత్తున సంఘటితం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. యువత సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజా సేవలో ముందుండేలా యువమోర్చా కార్యకర్తలను సమన్వయం చేస్తానన్నారు.
పార్టీ అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తానని పదవి కోసం కాకుండా పార్టీ సిద్ధాంతం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా సేవ కోసం పనిచేస్తానని,యువతను ఏకం చేసి పార్టీని మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యం” అని సుధాగాని ప్రమోద్ గౌడ్ పేర్కొన్నారు.. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర జిల్లా నాయకులకు జిల్లా కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి,జిల్లా యువ మోర్చా అధ్యక్షులు ఎర్రగుల భరత్ వీర్,మండల బిజెపి అధ్యక్షులు తడక వినయ్ తో పాటు బిజెపి బిజెవైఎం కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.