నేటి సాక్షి సెప్టెంబర్ 11 జూపాడుబంగ్లా
తంగడంచ ఏపీఐఐసీ భూముల్లో నెలకొల్పిన పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగులకు 75% ఉద్యోగాలు కల్పిస్తానని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు హామీ ఇస్తే అందులో నెలకొల్పిన ఐద్య పరిశ్రమ యాజమాన్యం మాత్రం ఒక్కరంటే ఒక్కరికీ కూడా ఉపాధి కల్పించకుండా ఇతర రాష్ట్రాల వారిని నియమించడం ఏంటని ముఖ్యమంత్రి హామీకి కూడా విలువ ఇవ్వరా అని స్థానిక నిరుద్యోగులను మోసం చేస్తున్న ఐద్య అగ్రి కంపెనీని ముట్టడి చేస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రమేష్ బాబుహెచ్చరించారు.గురువారం తంగడంచ గ్రామంలో నిరుద్యోగులతో కలిసి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐద్య అగ్రి కంపెనీ తంగడంచ ఏపీఐఐసి ప్రభుత్వ భూముల్లోనే ఉందని ప్రభుత్వం తక్కువ ధరలకు కేటాయిస్తేనే పరిశ్రమ నెలకొల్పింది తప్ప ఏదో పాకిస్తాన్లో లేదని వారు అన్నారు. ఆ కంపెనీ గోప్యంగా వ్యవహరిస్తూ కనీసం గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా తంగడంచ గ్రామస్తులకు కూడా తెలియని పరిస్థితుల్లో కంపెనీ నడపాల్సిన పని ఏముందని వారు ప్రశ్నించారు. ఈ భూములను నమ్ముకుని ఎన్నో సంవత్సరాలుగా చుట్టుపక్కల గ్రామాల నిరుద్యోగులు ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారని అలాంటి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తే ఉద్యమం తప్పదని వారన్నారు.. ఈ ప్రాంత నిరుద్యోగులు కనీసం సెక్యూరిటీ గార్డుగా కూడా పనికిరారా ఆని వారన్నారు. ఈరోజు కంపెనీ ని పర్యటించిన జిల్లా వ్యవసాయ అధికారి ప్రజలకు కంపెనీ గురించి వివరించాల్సిన అవసరం ఉందన్నారు. వారు కూడా కుమ్మక్కై ఎవరికి తెలియకుండా పర్యటించడం తగదన్నారు.కంపెనీ లో స్థానిక నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు ఉపాధి ఇవ్వాలని కోరుతూ గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహించి పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని వారు హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో తంగడంచ గ్రామ నాయకులు శ్రీనివాసులు నరసింహ సలీం రాజు తదితరులు పాల్గొన్నారు...