నేటి సాక్షి - జగిత్యాల
(పూరెళ్ల బాపు )
.....................................
గమ్యం చేరుస్తుందనుకున్న ఆర్టీసీ బస్సు దారితప్పి 66మందిని పొట్టనపెట్టుకుంది. ఊర్లను వల్లకాడు చేసింది. 6 గ్రామాలను విషాదంలో ముంచింది., గుట్ట పై నుండి ఘాట్ రోడ్డు మీదుగా వస్తున్న బస్ ఒక్కసారిగా ప్రమాదం కు గురైంది, క్షణాల్లో అక్కడ ఆహాకారాలు, ఆర్తనాదాలతో ఆప్రాంతమంతా మారుమోగుతోంది. అప్పటికే చాలా మందిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు., జగిత్యాల ఆస్పత్రి ఆవరణలో చనిపోయిన వారి మృతదేహాలను ఉంచారు. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. కేటీఆర్, కవిత, ఈటల రాజేందర్ హెలికాప్టర్ ద్వారా అక్కడికి వచ్చారు. బాధితులను ఓదార్చారు., తప్పును ఆర్టీసీ అధికారుల మీదికి తోసేసి వెళ్లిపోయారు. శవాలను బంధువులకు అప్పగించడమూ జరిగిపోయింది. మరుసటి రోజు మృతుల గ్రామాల్లో దహన సంస్కారాలు జరిగిన తీరు సమాజాన్ని కలిచివేసింది. భారీ వర్షంలోనూ మృతులకు జరిగిన దహన సంస్కారాలతో ఆ 6 ఊళ్లు అగ్నికీలలుగా మారాయి. ఆతర్వాత రాజకీయ పార్టీలు బాధిత గ్రామాల పర్యటన చేశాయి. యథాతథంగా ప్రభుత్వం తన బాధ్యత మరిచింది. ఇప్పటికీ ఇంకా ప్రభుత్వ సాయం అందని కుటుంబాలు ఉన్నాయి. మొత్తంగా కొండగట్టు మహా విషాదానికి ఎనిమిదేండ్లు పూర్తయింది.