దూతియా తండాలో తీరిన తాగునీటి కష్టాలు – మరమ్మతులతో

నేటి సాక్షి చిలుకూరు

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూతియా తండా: గ్రామపంచాయతీ పరిధిలో కొంతకాలంగా మరమ్మతులకు గురై వినియోగానికి నోచుకోని చేతిపంపును గ్రామపంచాయతీ సిబ్బంది ఎట్టకేలకు మరమ్మతు చేశారు. దీంతో చేతిపంపు తిరిగి పనిచేయడంతో స్థానిక ప్రజలకు తాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
చేతిపంపు పనిచేయకపోవడంతో నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొన్న స్థానికులకు మరమ్మతు చర్యలు ఉపశమనం కలిగించాయి. సమస్యను గుర్తించి చేతిపంపును వెంటనే రిపేరు చేయించిన గ్రామపంచాయతీ సర్పంచ్ లావూరి రమాదేవి శ్రీనివాస ను సి బ్బందిని గ్రామస్థులు అభినందించారు.
గ్రామంలో తాగునీటి వనరులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించి, ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావూరి రమాదేవి శ్రీనివాస్ ఉప సర్పంచ్ కొర్ర సురేష్ పాలకవర్గ సభ్యులు గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొన్నారు