•అధ్యక్షులు మిద్దె నర్సింలు.

నేటి సాక్షి, కులకచర్ల.
(గూడ సురేష్ మోత్కూర్.)
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఆదివారం నాడు పరిగి వర్కింగ్ జర్నలిస్టుల కమిటీ ఆధ్వర్యంలో మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది.
అధ్యక్షులు మిద్దె నర్సిములు, ఉపాధ్యక్షులు దోరెపల్లి శ్రీనివాస్, రాఘవేందర్ చారి,
ప్రధాన కార్యదర్శి, అల్లం శ్రీనివాస్,
కోశాధికారి, రవికుమార్,
కార్యదర్శి, చిల్లా చంద్ర శేఖర్,
ఆర్గనైజింగ్ కార్యదర్శి, ఎర్ర విష్ణువర్ధన్ రెడ్డి, మరియు కమిటీ సభ్యులు
చీమ ఆనంద్,మందుల శంకర్, నీరటి కృష్ణ, కేశవులు, రామస్వామి,
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల కమిటీ ఉపాధ్యక్షులు దోరే పల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నేర చరిత్రను బయటకు తీస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రజల తరఫున నీతి నిజాయితీగా ప్రజలకు సేవలు అందిస్తానని పేర్కొనడం జరిగింది. అలాగే నూతన కమిటీకి కూడా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పరిగి అధ్యక్షులు శ్రీనివాసరావు, ఎన్టీవీ రిపోర్టర్ శ్రీనివాస్, వెలుగు రిపోర్టర్ రాములు, తదితరులు పాల్గొన్నారు.