*నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి..*

* నేటి సాక్షి ధర్మపురి బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం..*

*నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి..*

*రేగడి మద్దికుంట లో* *ఇంజనీరింగ్ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లక్ష్మణ్ కుమార్* ..

*బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఔట్సోర్సింగ్ ఉద్యోగం ప్రభుత్వ విఫ్ విజయ రమణారావు..*

*సుల్తానాబాద్:*

ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థికి పురుగుల మందు తాగించి అతి దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

గురువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో అమృత రాణి కుటుంబాన్ని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే ఠాగూర్ మక్కాన్సింగ్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం పోలీస్ కమిషనర్ అంబార్ ఝా కిషోర్ తో కలిసి మంత్రి మృతురాలు తండ్రి ఇసాక్ తల్లి రజితల పరామర్శించి ఓదార్చారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదువుతూ హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్న అమృతరాణి అనే విద్యార్థిని సింగరేణిలో ఎంట్రన్షిప్ చేస్తుందని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీన ఇద్దరు వ్యక్తులు ఆమెకి పురుగుల మందు తాగించి అతి పాశవీకంగా హత్య చేశారని ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ఇంజనీరింగ్ విద్యార్థిని హత్యకు కారణమైన వారిని పోలీసులు 24 గంటల్లోపు అరెస్టు చేశారని మంత్రి తెలిపారు. దోషులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేవిధంగా పోలీసులు చార్జిషీటు దాఖలు చేయాలని రామగుండం సీపీని మంత్రి ఆదేశించారు.

భవిష్యత్తులో దళితులపై పేదలపై ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు సంబంధించి 2013 తర్వాత ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి హై లెవెల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష నిర్వహించారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మృతి చెందిన అమృతరాణి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి అడ్లూరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బాధ్యత కుటుంబానికి రూ. 4.12 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మరో నాలుగు లక్షల 12,000 అందజేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇల్లు తో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని ప్రకటించినందుకు ఎమ్మెల్యే విజయరమణారావు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.


*బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు..*

*ప్రభుత్వ విప్ విజయ రమణారావు..*

ఇంజనీరింగ్ విద్యార్థిని అమృతరాణి కుటుంబం కి ఇందిరమ్మ ఇల్లు తో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగం అందిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు హామీ ఇచ్చారు. జరిగిన సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి దోషులకు శిక్షపడే విధంగా చర్యలు తీసుకుంటామని విజయ రమణారావు తెలిపారు. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు తానే భరిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

*మహిళలపై దాడులను ఉపేక్షించేది లేదు..*

*రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్..*

రాష్ట్రంలో మహిళలపై వేధింపులకు పాల్పడిన వాళ్లు ఎంతటి వారైనా శిక్షించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ సింగరేణిలో దళితులపై దాడులు జరుగుతున్నాయని విచారణ జరిపించి బాద్యులైన సింగరేణి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.