మండల ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
నేటి సాక్షి చిలుకూరు (మొక్క వెంకన్న గౌడ్)
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. వర్షాల తీవ్రత దృష్ట్యా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, వాగులు, చెరువులు, కాలువలు, వరదనీటి ప్రవాహాల వద్దకు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు. వర్షాల సమయంలో ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై మోహన్ బాబు కోరారు.