నేటి సాక్షి చిలుకూరు (మొక్క వెంకన్న గౌడ్)
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో కురిసిన భారీ వర్షాలతో పలుచోట్ల పంట పొలాలు నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో పంటలు నీటిలో మునిగిపోయాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే సాగు పనులు పూర్తిచేసుకుని పంటలు ఏపుగా పెరుగుతున్న సమయంలో భారీ వర్షాలు కురవడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో నిలిచిన నీటిని వెంటనే తొలగించేలా అధికారులు చర్యలు చేపట్టాలని, పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని వారు కోరుతున్నారు.
వర్షాల తీవ్రత మరింత పెరిగితే పంట నష్టం భారీగా ఉండే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మండలంలోని నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి, పంట నష్టంపై సమగ్రంగా అంచనా వేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.