నారాయణపేట జిల్లాలోని

నేటి సాక్షి నారాయణపేట సెప్టెంబర్ 24 (రిపోర్టర్ ఇమామ్ సాబ్ )

నారాయణపేట జిల్లాలోని
మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని చందాపురం గ్రామంలో గురువారం నాడు ఆ గ్రామంలో ప్రతిష్టాపన చేసిన విగ్నేశ్వర మండపాల దగ్గర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణనాథుడు అన్ని వర్గాల ప్రజలను చల్లగా చూడాలని స్వామివారి దీవెనలు అందరి పై ఉండి అందరి అభివృద్ధికి తోడ్పడాలని ప్రత్యేకంగా ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు. వర్షాకాలంలో మంచి వర్షాలు కురిసి రైతుల కష్టాలు తీర్చాలని అందుకు గణనాథుడు ఆశీర్వదించి అందర్నీ ఆదుకోవాలని కోరినట్లు ఆయన చెప్పారు అనంతరం నిర్వాహకులు ఏర్పాటుచేసిన అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు చందాపురం అశోక్ కుమార్ గౌడ్ నిర్వాకులు బద్రి రాము అంజి నరసింహ శంకర్ కళ్యాణి రాజు రవి రామన్ గౌడు వెంకటేష్ గౌడ్ శ్యాంసుందర్ గౌడ్ రంజిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.