చెరువులు, వాగులు, నాలాల్లో

హన్మకొండ సెప్టెంబర్ 24 నేటి సాక్షి

జిల్లాలో భారీ వర్షాలు కురి సే అవకాశం ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో గూగుల్ మీట్ నిర్వహించి వర్షాల పరిస్థితిపై సమీక్షించారు.
మండలాల వారీగా వర్ష పాతం, చెరువులు, వాగు లు, వంకలు, రహదారుల పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గతంలో వర్షాల సమయంలో ఇబ్బం దులు ఎదురైన ప్రాంతాల ను గుర్తించి అక్కడ ముంద స్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వేలేరు, ఆత్మకూర్ మండలాల్లో బుధవారం అధిక వర్షపా తం నమోదైందని, గురు, శుక్రవారాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాగులు, వంక లు పొంగి రహదారుల పైకి వరద నీరు వచ్చే ప్రాంతాల ను ముందుగానే గుర్తించా లని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన చోట ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచా లని, చెరువుల్లోనీటిమట్టం, నీటి ప్రవాహాన్ని సాగునీటి శాఖ అధికారులు ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. గ్రేటర్ వరంగ ల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలాల్లో పేరుకు పోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను వెంటనే తొలగించి, ప్రధాన నాలాల్లో వరదనీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో జేసీబీలు, ఇతర యంత్రాల ను సిద్ధంగా ఉంచాలని సూచించారు.భారీ వర్షాల సమయంలో అధికారులు తమ పరిధిలోనే అందు బాటులో ఉండి, సమస్య తలెత్తిన వెంటనే క్షేత్ర స్థాయిలో స్పందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కంట్రోల్ రూమ్‌లో అధి కారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాల ని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అత్యవసర సమాచారంపై వెంటనే స్పందించాలని ఆదేశించా రు.రహదారులు, వాగులు, వంకలు, చెరువులు, డ్రైనే జీ వ్యవస్థలపై నిరంతరం నిఘా ఉంచాలని, వర్షాల కారణంగా ఎక్కడైనా నష్టం జరిగితే వెంటనే వివరాలు అందజేయాలని సూచించా రు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయా లని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. రవి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొ రేషన్ కమిషనర్ వెంకన్న, ఆర్డీవోలు వెంకటేష్, డీఎస్ వెంకన్న, జడ్పీ సీఈఓ శేషాద్రి, పరకాల మున్సి పల్ కమిషనర్ పవన్, సాగునీటి శాఖ ఈఈ మంగీలాల్, ఆర్‌అండ్‌బీ ఈఈ దేవిక చౌహన్, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.