హన్మకొండ సెప్టెంబర్ 26
నేటి సాక్షి
నగరంలోని కాకాజీ కాలనీ లో డాక్టర్ రాకేష్ కిరణ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సుగుణ గ్యాస్ట్రో కేర్ సెంటర్ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శనివారంముఖ్య అతిథులుగా హాజరై ప్రారం భించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. బయట నూనె పదార్థాలు, నాణ్యత లేని ఆహారం తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని సూచిం చారు. డాక్టర్ రాకేష్ కిరణ్ మాట్లాడుతూ కేంద్రంలో గ్యాస్ట్రో, లివర్, పేగులు తదితర సమస్యలకు ప్రత్యేక వైద్య సేవలు అంది స్తున్నట్లు తెలిపారు. ఎండో స్కోపీ, కొలనోస్కోపీ వంటి ఆధునిక వైద్య పద్ధతులతో చికిత్స అందించడంతో పాటు, అన్నవాహికలో ఇరుక్కున్న నాణేలు, పిన్నీ సులు, చేపముళ్లు, ఎముక లు తదితర విదేశీ వస్తువు లను ప్రత్యేక పరికరాలతో తొలగించే సదుపాయం ఉందన్నారు.కార్యక్రమంలో డాక్టర్ కాళీ ప్రసాద్, మాజీ కుడా చైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్ జక్కుల, రవీందర్ యాదవ్, తోట వెంకన్న, బొజ్జ సమ్మయ్య యాదవ్, డాక్టర్ శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.