*నేటిసాక్షి. కుత్బుల్లాపూర్*
సీఎంసీ నిజాంపేట్ సర్కిల్ విజయదుర్గ కాలనీ (జీపీఆర్) లో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మాట్లాడుతూ,
సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా కాలనీలో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయవచ్చని, కాలనీలోకి వచ్చి వెళ్లే రహదారులను గుర్తించి సీసీ కెమెరా ఏర్పాటు ద్వారా సేఫ్ అండ్ స్మార్ట్ కాలనీగా విజయదుర్గ కాలనీ నిలుస్తుంది అన్నారు.
వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పోలీసులతో కలిసి స్ట్రాటజిక్ పాయింట్లను గుర్తించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా కాలనీ రక్షణ మరింత బలపడుతుందన్నారు.
అదేవిధంగా రోజురోజుకు పెరుగుతున్న జనాభా నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో త్రాగునీటి, భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా విజయ దుర్గా కాలనీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, రాము రాథోడ్, డీఈ పాపమ్మ, ఏఈ ప్రవీణ్, వాటర్ వర్క్స్ అధికారులు, మాజీ డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్, విజయ దుర్గ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి. రమణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్యాంసింగ్, ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, సభ్యులు ఎస్. రాకేష్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, సుమన్, వైయస్, బి. సందీప్, విశ్వనాథ రెడ్డి, వినోద్, శివ నాగరాజు, యుగంధర్, దుర్గాప్రసాద్, మాజీ కార్పొరేటర్లు రవి కిరణ్, బాలాజీ నాయక్, మాజీ కో ఆప్షన్ సభ్యులు చంద్రగిరి సతీష్, నాయకులు సాంబశివరెడ్డి, శ్రీకర్ గుప్తా, మధుసూదన్ రెడ్డి, చంద్రయ్య, బొబ్బ శ్రీను, పోతినేని ప్రవీణ్, యశ్వంత్, మహమ్మద్ సలీం, మహిళా నాయకురాలు లతా రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.