ఉప్పల్ ఎమ్మెల్యే చేతుల మీదగా అందజేత

ఉప్పల్ అక్టోబర్ 4 నేటి సాక్షి :

జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లవేళలా తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు వడ్డేపల్లి కిషోర్ ప్రధాన కార్యదర్శి ఆనంద నరసింహారెడ్డి ల ఆధ్వర్యంలో గ్రూప్ సభ్యులకు ఇన్సూరెన్స్ బాండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమా నికి ముఖ్యఅతిధి గా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి విచ్చేసి ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి పలువురు జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ బాండ్లను ఎమ్మెల్యే చేతుల మీదగా అందజేశారు. బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గుడి మధుసూదన్ రెడ్డి ఆర్థిక సాయంతో జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టులు నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, వారి సంక్షేమం, భద్రత కు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమం లో గుడి మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వర్ రావు,నేర్థం భాస్కర్ గౌడ్, నాయకులు ఈరెల్లి రవీందర్ రెడ్డి,తిరుమలేష్,కొంపల్లి రవీందర్,పల్లె రాజకుమార్ గౌడ్,గడ్డం పాపి రెడ్డి,పిట్టల నరేష్,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వడ్డేపల్లి కిషోర్,ప్రధాన కార్యదర్శి నర్సింహా రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా సీసా నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ బోడ ప్రవీణ్, ఇడపాక సురేష్, కమిటీ సభ్యులు వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.