ప్రజా సమస్యలపై యువత ముందుండాలి –

కూకట్‌పల్లి: కాంగ్రెస్ పార్టీకి యువతే ప్రధాన బలమని, కూకట్‌పల్లి నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్‌ను మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ బండి రమేష్ పిలుపునిచ్చారు.

కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శ్రీ హేమ దుర్గా భవన్లో కూకట్‌పల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌ను యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం.డి. సలీం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బండి రమేష్ హాజరై యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. ప్రజా సమస్యలపై యువత ముందుండి పోరాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ప్రతి డివిజన్‌లో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ యువతను పెద్ద సంఖ్యలో పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని బండి రమేష్ సూచించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంలో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు.

సమావేశంలో కూకట్‌పల్లి నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ కార్యకలాపాల విస్తరణ, యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం, రాబోయ�