సినీనటి రితిక నాయక్ చేత ప్రారంభం...

నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలో మెయిన్ రోడ్డు నూతనంగా ఏర్పాటుచేసిన షీ షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీనటి రితిక నాయక్ చేత ఎండి వినీత రోహిత్ ఆదివారం ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ యాంకరింగ్ చేత నృత్యాలు డప్పు చప్పుళ్ళతో కొలహలంతో ప్రారంభించి తమ బ్రాంచ్ ను మిర్యాలగూడ ప్రజలు ఆదరించాలని ఎండి వినిత రోహిత్ అన్నారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ సినీనటి రితిక నాయక్ మాట్లాడుతూ, మిర్యాలగూడ పట్టణంలో ఇటువంటి గొప్ప షాపింగ్ మాల్ ను ప్రారంభించడం చాలా గొప్ప విషయమని షీ నీడ్స్ షాపింగ్ మాలో ప్రజలందరికీ అందుబాటులో ధరలు ఉంటూ నాణ్యత ఎక్కువ ఉంటాయని మిర్యాలగూడ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షీ నీడ్స్ నిర్వాహకులు, సిబ్బంది ప్రముఖులు, ప్రజలు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.