నేటి సాక్షి ,టేక్మాల్ (అందోల్):
మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం
టేక్మాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా విష్ణు వర్ధన్ రెడ్డి నియమితులయ్యారు. నియామకపత్రాన్ని మంత్రి దామోదర చేతుల మీదుగా ఆదివారం అందుకున్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానన్నారు.
ఇప్పటివరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగిన నిమ్మ రమేష్ స్థానం లో పట్లోళ్ల విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన మంత్రి దామోదర, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నియోజకవర్గ పరిధిలోని మండలా లు, పట్టణాలకు నూతన పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా టేక్మాల్ మండల అధ్యక్షుడిగా పట్లోళ్ల విష్ణువర్ధన్ రెడ్డి ని నియమించారు.
*ఆలస్యమైనా.. పక్కా ముహూర్తం..!*
ఈ నియామక ప్రక్రియ కొంతకాలం క్రితమే పూర్తయినప్పటికీ, అధికారిక ప్రకటన
మాత్రం కొంత ఆలస్యంగా వెలువడింది. మండలంలో క్షేత్రస్థాయి పరి స్థితులు, సీనియర్ నాయకు లు, సర్పంచులు, కార్యకర్తల మధ్య సమన్వయం వంటి అంశాలను పరిగణనలోకి తీ సుకున్న తర్వాతే నియామకా న్ని ప్రకటించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందరినీ సమన్వయం చేసు కుంటూ కొత్త అధ్యక్షుడిని బా ధ్యతల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ప్రకటనలో కొంత జాప్యం జరిగినట్లు కాంగ్రెస్ శ్రేణుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మంత్రి చేతుల మీదుగా నియామక పత్రం.. నియామక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిం హ నివాసంలో పట్లోళ్ల విష్ణువర్ధన్ రెడ్డి నియామకప త్రాన్ని అందుకున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ స్వయంగా నియామక పత్రాన్ని అందజేసి శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాన్ కిషన్, మల్లారెడ్డి, మెదక్ జిల్లా మాజీ కోఆప్షన్ మెంబర్ యూసుఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు, పట్లోళ్ల అశోక్ రెడ్డి, ఆశిలి సాగర్, జిల్లా మైనారిటీ చైర్మన్ మజార్, జోగిపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ
మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు సేవాలాల్, పలువురు సర్పంచులు భూమిరెడ్డి , అవినాష్, సంగమేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన మండల అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.
*నాయకులు, కార్యకర్తల, యువ నాయకులు,అభినందనలు*
పట్లోళ్ల విష్ణువర్ధన్ రెడ్డి నియామకంపై టేక్మాల్ మండల కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, యువ నాయకులు, హర్షం వ్యక్తం చేశారు. ఆయనను పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందన లు తెలిపారు. నూతన అధ్యక్షుడి నాయకత్వంలో మండలంలో పార్టీ కార్యక్రమాలు మరింత చురుగ్గా సాగుతాయని పలువురు నాయకులు పేర్కొన్నారు.