వరంగల్ ఎనుమాముల వ్యవ సాయ

హన్మకొండ అక్టోబర్ 04
నేటి సాక్షి

వరంగల్ ఎనుమాముల వ్యవ సాయ మార్కెట్ సమీపంలోని బాలాజీ నగర్‌లో ప్లాస్టిక్
స్క్రాప్ గోదాములోఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఘటన స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలు, నష్టంపై అధికారులను, స్థాని కులను అడిగి తెలుసుకున్నా రు. ప్రజల భద్రతకు ప్రాధాన్య త ఇవ్వాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరా వృతం కాకుండా స్క్రాప్ గోదా ముల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు.