జోగిని, బసివిని, మాతాంగి, శివసత్తులకు నెలకు

హన్మకొండ అక్టోబర్ 05
నేటి సాక్షి

జోగిని, బసివిని, మాతాంగి, శివసత్తులకు నెలకు రూ.5 వేల సామాజిక పెన్షన్ మంజూ రు చేయడంతో పాటు ఇందిర మ్మ ఇళ్లు, ప్రభుత్వ పథకాలు అందించాలని డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేం దర్ డిమాండ్ చేశారు. బాధి తులతో కలిసి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌ పాయ్‌కు వినతిపత్రం అంద జేశారు. జోగినిల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్ర మంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అంకేశ్వరపు రాంచందర్ రావు, డీబీఎఫ్ నాయకులు, జోగినిలు పాల్గొన్నారు.