నేటి సాక్షి అక్టోబర్ పాములపాడు (అక్టోబర్-5):-
మండల కేంద్రమైన పాములపాడులో, నందికొట్కూరు నియోజవర్గ ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాల వసతి గృహ భవనాన్ని ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ ఏడబ్ల్యుపి అండ్ బి నిధుల కింద,167.50 లక్షల అంచనా తో ఈ వసతి గృహ భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాలిక విద్యను ప్రోత్సహించడానికి పాఠశాలలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో బడి మధ్యలో మానేవేసిన డ్రాపోర్ట్స్ బాలికలు, బాల కార్మికులు, ఆరవ తరగతి నుండి ఇంటర్ వరకు మంచి విద్య, భోజన వసతితో బాగా చదువుకోవచ్చు అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కేజీబీలో విద్యార్థులకు పెడుతున్న భోజనాలను, వసతిని అన్ని తనిఖీ చేయడం జరిగింది. విద్యార్థులను మెనూ ప్రకారం మంచి పోషకాహారము అందించాలని, విద్యార్థులను తమ సొంత పిల్లలుగా అందరు సిబ్బంది చూసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, టిడిపి మండల కన్వీనర్ జి.రవీంద్రారెడ్డి, వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి జి.హరిప్రసాద్ యాదవ్, డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, పాములపాడు సింగిల్ విండో చైర్మన్ సి.గోవిందు, మద్దూరు సింగిల్విండో చైర్మన్ జనార్దన్ రెడ్డి, కాంట్రాక్టర్ బానకచర్ల సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు మద్దూరు తిమ్మారెడ్డి, భానుముక్కల బండ్లమూరి వెంకటేశ్వరరావు, మెగా మళ్ళీ, జలాల్, జూపల్లి మద్దిలేటి , మాజీ సర్పంచ్ కుమారుడు , రాజశేఖర్ ఉప సర్పంచ్ నబీరసుల్, మరియు మండల డాక్టర్.నాగలక్ష్మి దేవి, వైద్య సిబ్బంది మరియు తదితరులు ఎర్రగుడూరు చెల్లె హరినాథరెడ్డి, శివ శంకర్ స్వామి, ఎంఈఓ-1 బాలాజీ నాయక్, జిసిడివో టి.జ్యోతి, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపాల్ ఎం.రాజ్యలక్ష్మి, డిటి పఠాన్ బాబు, ఎస్సై పి.తిరుపాలు, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, ఎంఈఓ-2 బి.గోపాల్, విబిజి రామ్ జి ఏపీవో బి.జయంతి, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్కూల్ అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.