- ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా 22 : ప్రజాస్వామ్య వ్యవస్థలను బలపరచడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే మేఘా రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి పట్టణంలో జరిగిన ప్రజాపక్షం దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పత్రికలు ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే వేదికలుగా పనిచేస్తాయి. అవి ప్రజల హక్కులను రక్షించే కవచాలుగా నిలుస్తాయి. ప్రజాస్వామ్య విలువలను పత్రికలు కాపాడుతాయి. పత్రికలు మాత్రమే కాదు, ఎలక్ట్రానిక్ మీడియా మరియు డిజిటల్ మీడియా కూడా సమాజంలోని ప్రతి పౌరుడి కర్తవ్యాలను గుర్తు చేసే సాధనాలుగా నిలుస్తున్నాయి అని అన్నారు. ప్రజా పక్షం దినపత్రిక ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకురావడంలో ప్రథమ స్థానం ఇస్తుందని ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి అన్నారు.అత్యంత పారదర్శకంగా పనిచేసే పత్రికలు ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలపరుస్తాయని, ప్రతి వ్యక్తి బాధ్యతాయుతంగా సమాచారాన్ని పంచుకోవాలని ఎమ్మెల్యే మేఘా రెడ్డి సూచించారు. ఈ కార్య క్రమంలో టీయూడబ్ల్యూ(ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి,ప్రజాపక్షం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గుండ్రాతి మధు గౌడ్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి డి. మాధవరావు, పట్టణ మాజీ అధ్యక్షులు బి. లక్ష్మణ్ జిల్లా సీనియర్ నాయకులు ఎల్. రవికాంత్, విజయ్, ప్రజాపక్షం రిపోర్టర్లు సి, ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, రమేష్, సలీం, రమేష్, వేణుగోపాల్, శ్రీకాంత్, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.





