- ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ మరియు ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్
నేటి సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెల్త్ మిషన్ లో ఆల్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ గా పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు అతి తక్కువ జీతాలు చెల్లించటం అన్యాయమని, డిగ్రీలు పాసై ఉద్యోగ అర్హత పొంది డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నిక అయినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్లకు జీవో నెంబర్ 60 ప్రకారం రూపాయల 22750/- జీతం రావలసి ఉండగా వారికి కేవలం 15 వేల జీతం మాత్రమే చెల్లించటం ఎన్ హెచ్ ఎం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ విమర్శించారు.నేడు ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి) ఆధ్వర్యంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల ధర్నా కోఠి లోని ఎన్ హెచ్ ఎం డైరెక్టర్ కార్యాలయం ముందు జరిగింది. ఈ సందర్భంగా రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ… పి.హెచ్.సి.లో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి అన్ని ఆన్లైన్ల వర్కులను చేయటం జరుగుతుందని గత అనేక సంవత్సరాలుగా ఉద్యోగాలు నిర్వహిస్తున్న గతంలో జీవో నెంబర్ 510లో గత ప్రభుత్వం అన్యాయం చేసింది అని ప్రస్తుత ప్రభుత్వమైన కనీస వేతనాల జీవో అయినటువంటి 60 ని అమలు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని వారు తెలియజేశారు.ఈ స్కీములో కొద్ది మంది ఉద్యోగులకు గతంలో అన్యాయం జరిగింది అని అనేక సందర్భాలలో అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ వారి జీతాల పెంపుదలకు చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని ఉన్నత విద్య చదివినటువంటి డీఈవోలు కేవలం 15 వేల రూపాయలకు ఉద్యోగం చేయడం ఎంతవరకు సమంజసం అధికారులే ఆలోచించాలి అని వారు పేర్కొన్నారు. అనంతరం యూనియన్ ప్రతినిధులు నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ ఆర్.వీ.కర్ణన్ ని కలిసి ఉద్యోగుల సమస్యలపై విచారించి వీరి జీతాల పెంపుదలకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని కోరడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆర్.వి కర్ణన్ స్పందిస్తూ… జీవో నెంబర్ 60 ప్రకారం జీతం ఇచ్చే విధంగా ప్రభుత్వానికి ఫైల్ పంపిస్తానని యూనియన్ ప్రతినిధులకు హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సారంగుల బాలసుబ్రమణ్యం, డాటా ఎంట్రీ ఆపరేటర్లు రాష్ట్ర నాయకులు బత్తుల రాఘవేంద్ర, అఖిల్ గౌడ్, వంగ స్వాతి, ప్రవీణ్, శ్రీదేవి, సౌజన్య, శ్రీకాంత్, ఇమ్రాన్, సౌమిత్రి, ప్రవీణ, సిద్దు, గౌతమి, సునీత, నాగార్జున, రాజశేఖర్, అనిత కళ్యాణి మరియు తదితరులు పాల్గొన్నారు.



