Monday, December 23, 2024

NHM: ఎన్​హెచ్​ఎం ఉద్యోగులను క్రమబద్దీకరించాలి

– ఎన్​హెచ్​ఎం (ఏఐటీయూసీ) రాష్ర్ట ప్రధాన కార్యదర్శి

నేటి సాక్షి, జనగామ: జాతీయ ఆరోగ్య మిషన్​లో పని చేస్తున్న ఉద్యోగులను క్రమబద్దీకరించి, వారి సమస్యలు పరిష్కరించాలని జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా అన్నారు. జనగామ పట్టణంలోని గబ్బెట గోపాల్​రెడ్డి భవనంలో సీపీఐ కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు జ్యోతి ఆధ్వర్యంలో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ రాజేష్ ఖన్నా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

జాతీయ ఆరోగ్య మిషన్​లో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, లేదా హెచ్​ఆర్డీఏ పాలసీ ఇవ్వాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రతి ఉద్యోగికి సంవత్సరానికి 35 క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన లీవులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కందిక చెన్నకేశవులు పాల్గొన్నారు.

అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఎన్​హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్​ సోర్సింగ్​ ఎంప్లాయీస్ (ఏఐటీయూసీ) జనగాం జిల్లా అధ్యక్షురాలిగా గంగరబోయిన జ్యోతి, ఉప అధ్యక్షురాలుగా ఓరుగంటి సమ్మక్క, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎలిమినేటి గణేశ్​, వర్కింగ్ ప్రెసిడెంట్​గా పారు నాంది లిఖిత రాణి, ఉప అధ్యక్షురాలుగా ఏదునూరి పద్మ ,ఉపాధ్యక్షుడుగా బానోతు భాస్కర్, కోశాధికారిగా చెన్నూరి మల్లేశం ,జాయింట్ సెక్రటరీలుగా జేరిపోతుల ప్రియాంక, తీర్చి రజిని, చీఫ్ అడ్వైజర్ పనికెల సౌజన్య, ఈసీ మెంబర్స్​గా డాక్టర్ బగడం భార్గవి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొండ్ర లత, ఈసీ సభ్యులుగా చిలుకమారి అంజయ్య, మరిపెల్లి కవిత తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News