నేటిసాక్షి, బ్యూరో నిజామాబాద్ టి.ఎన్ రమేష్ : గురువారం రోజున నిజామాబాద్ పట్టణంలోని, సుభాష్ నగర్ లో గల, మాల మహానాడు జిల్లా కార్యాలయంలో, నిజామాబాద్ మండల మాల మహానాడు సమావేశం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి, నిజామాబాద్ మండలంలోని వివిధ గ్రామాల నుండి, మాల సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, యువకులు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరెడి లక్ష్మణ్ ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షుడు సక్కి విజయ్ కుమార్ అధ్యక్షతన, కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి సక్కీ ప్రభంజన్, జిల్లా అధికార ప్రతినిధి టి.ఎన్ రమేష్, తాటి రాజు, సంతోష్, నిజామాబాద్ నగర అధ్యక్షులు సక్కి చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు సుంకరి విజయ జనరల్ సెక్రెటరీ సునీత శోభన్ ప్రశాంత్ సునీల్ విద్యాసాగర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.





