- పంచాయతీ కార్యదర్శికి యువకుల వినతి
నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామ శివారులో వ్యవసాయ భూమిలో నిర్మిస్తున్న అక్రమ పిరమిడ్ కట్టడాన్ని కూల్చివేయాలని, ఇట్టి నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వవద్దని గ్రామ యువకులు బుధవారం గ్రామపంచాయతీకి వెళ్లి కార్యదర్శికి వినతిపత్రం అందజేసారు. ఈ నిర్మాణం వల్ల గ్రామంలో ప్రశాంతత దెబ్బతింటదని వివరించారు. కాగ గ్రామ శివారులో ఓ గుడిసె లో చేస్తున్న అన్యమత ప్రచారాన్ని నిలిపివేయాలని కోరుతూ హిందూ చైతన్య వేదిక, ఆలయాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆ వినతి పత్రంలో కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిరమిడ్ ముసుగులో హిందూ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు భిన్నంగా అన్యమత ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని కోరారు. అన్యమతస్తులు మత మార్పిడిలు ప్రోత్సహించడం వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక,ఆలయాల పరిరక్షణ కమిటీ సభ్యులు క్యాషనూరి మఠం జగదీశ్వర్,బూస గంగ మల్లయ్య,సద్ది మహిపాల్, బేతి సత్యనారాయణ, దేశ వేని శ్రీనివాస్, శివనీతి కిష్టయ్య, పాలడుగు లింగారెడ్డి, రామన్న, కొల్ల కృష్ణారెడ్డి, వట్టిమల్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.



