నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ )
గొల్లపల్లి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ గొల్లపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ జడ్పీటీసి, మండల పార్టీ అధ్యక్షుడు గోస్కుల జలంధర్ మాట్లాడుతూ యాదాద్రి జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ మాజీ శాసన సభ్యులు పైల్ల శేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదాద్రి జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి చేసి పార్టీ కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేసి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి చిత్ర పటాలను పగులగొట్టడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అలాగే కరీంనగర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ లో పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ లతో పాటు, పార్టీ మారిన జగిత్యాల శాసన సభ్యులు సంజయ్ కుమార్ ప్రశ్నించి నందుకు సమావేశం నుంచి పోలీసుల తో బయటకు పంపించి అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ పజా పాలన పేరుతో విధ్వంస పాలన చేస్తున్నదని, హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతూ ప్రతిపక్షాన్ని అనగ దొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. శ్రీరామ్ సాగర్ లో పుష్కలంగా నీరు ఉన్న సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కెసిఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఎత్తిపొస్తే రైతులకు సాగునీరు అందేదని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి సంవత్సరం గడిచిన రైతు భరోసా ఇవ్వలేదని,పూర్తి స్థాయి రుణమాఫీ చేయలేదన్నారు. ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ చేయాలని, 15000 రైతు భరోసా ఇవ్వాలని, భూమి లేని నిరుపేదలకు 12000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీపీ కంపెల్లి హన్మండ్లు, మాజీ రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు అశోక్ రావు, సింగల్ విండో ఉపాధ్యక్షుడు నవ్వ తిరుపతి, మాజీ ఎంపీటీసీ గొలి గంగారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ఏడమల మల్లారెడ్డి, నాయకులు గుడ్ల పెద్దన్న, సిద్దెంకి మల్లారెడ్డి, కలకోట సత్యం, రత్నం, బోజనపు శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, కొమల్ల జలంధర్ బి ఆర్ ఎస్ పార్టీ మీడియా కన్వీనర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.





