Sunday, March 15, 2026

ఎన్టిపిసి విద్యుత్ ప్రాజెక్ట్ దేశానికి వెలుగులు కుటుంబాల జీవితాలలో చీకటి మాయ

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : ఎన్ టి పి సి విద్యుత్ ప్లాంట్ కోసం తమ భూములను త్యాగం చేసిన ఎన్టిపిసి భూనిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు అండగా బిఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని నష్టపరిహారం చెల్లించే వరకు పోరాడుతానని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. నూతనంగా నిర్మాణం చేపట్టనున్న 2400 మెగావట్ల పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం మంగళవారం ఎన్ టి పి సి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యావరణ, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఎన్టిపిసి ప్రభావిత ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని ఎన్టీపిసి పట్టణ బంధుకు, పిలిపించిన మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ ప్రజాభిప్రాయ సేకరణ జరిగే సభ స్థలానికి వెళుతున్న క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ… రామ గుండంలోని ఎన్టీ పీసీ విద్యుత్ ప్రాజెక్ట్ దేశానికి వెలుగులు అందిస్తున్నా. నిర్వాసి తుల కుటుంబాలు జీవితాల్లో చీకటి మయం చేస్తుందన్నారు. భూ నిర్వసీతులు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే అభిప్రాయ సేజరణ చేపట్టాలని డిమాండ్ చేసారు. ఎన్టీపీసీ లో ముఖ్య భూమిక పోషించిన కాంట్రాక్టు కార్మికులను ఎన్టీపీసీ యాజమాన్యం విస్మరించిందని కార్మికుల పిల్లలకు మేరుగైనా విద్య వైద్యం సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ స్టేజ్-2లో చేపట్టే 2,400 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుతో ఈ ప్రాంతం కాలుష్యంగా మారుతుందన్నారు. విలువైన భూములు అందిస్తున్న నిర్వాసితులకు ప్రాజెక్టులో ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభావిత, పునరావాస ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించి, మౌలిక వస తులు కల్పించాలని కోరారు. కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు కార్పొ రేట్ స్థాయిలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించి ఉచిత వైద్యం అందించాలని డిమాం డ్ చేశారు. కుందనపల్లి, మల్యాలపల్లె, అక్బర్నగర్, బద్రిపల్లె, మొఘల్పహాడ్, మాతంగి కాలనీవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. పవర్ ప్రాజెక్టు కింద భూములు త్యాగం చేసి సర్వస్వం కోల్పోయిన భూ నిర్వాసితులకు ఎన్టీపిసి యజమాన్యం బెదిరింపులకు గురిచేస్తుందన్నారు తక్షణమే భూనిర్వాస్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.పోలీసుల అదుపులో తాజా మాజీ కార్పోరేటర్లు కన్నూరి సతీష్ కుమార్, ముదాం శ్రీనివాస్.కుమ్మరి శ్రీనివాస్. నల్ల వెంకటరమణ రెడ్డి. పెంట రాజేష్ .బిఆర్ఎస్ పార్టి నాయకుకు బొడ్డుపల్లి, శ్రీనివాస్, బొడ్డు రవీందర్, అచ్చే వేణు, మెరుగు పోచం, బండారి ప్రవీణ్, కొల్లూరు సతీష్, సందెల మల్లయ్య, కొల్లూరి శరణ్య, మధుకర్ రెడ్డి, పల్లె శ్రీనివాస్, బండారి శ్రీవాణి, కిరణ్, రానాపూర్, శ్రీనివాస్, గిట్ల లక్ష్మారెడ్డి. నిజాముద్దీన్, చిలుక ప్రసాద్, చిలుక శంకర్, నాంసాని శంకర్, తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News