Thursday, March 12, 2026

తెలుగు జాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన గొప్ప ఘనత ఎన్టీఆర్ దే

  • మేకల తిరుమల రెడ్డి

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) రామచంద్రాపురం : తెలుగు జాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన గొప్ప ఘనత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు దేనని తెలుగు దేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు మేకల తిరుమల రెడ్డి కొనియాడారు శనివారం మండల కేంద్రము లో దివంగత నేత ఎన్టీఆర్ 29 వ వర్థంతి ఘనంగా జరిగింది. ముందుగా మాజీ ఎంపిపి తానికొండ కేశవులు నాయుడు, చేకూరి జనార్థన్ చౌదరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా తిరుమల రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగు దేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్న ప్రజా నాయకుడిని తెలిపారు. సినీ ప్రపంచంలో పాత్రలకు జీవం పోసిన మహా నాయకులు స్వర్గీయ ఎన్టీఆర్ శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా, దుర్యోధనుడిగా, కర్ణుడుగా, పౌరాణిక పాత్రలతో పాటు జానపద, ప్రజలను చైతన్యవంతులుగా, సామాజిక చిత్రాలు అనేక పాత్రలు చేసినా గొప్ప నాయకులు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలోనే మండల వ్యవస్థను తీసుకువచ్చారు. నిరుపేదలకు ఇండ్లు, జనతా వస్త్రాలు, రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం, బడుగు బలహీన వర్గాలకు 33 శాతం రిజర్వేషన్లు, మహిళలకు, తండ్రి ఆస్తిలో హక్కు, అనేక పథకాల ప్రవేశపెట్టి మద్యపానం సంపూర్ణంగా నిషేధించిన ఘనత ఎన్టీఆర్ ప్రభుత్వదేనన్నారు. అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప నాయకులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిన్నబాబు మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఈ ఉమాపతి నాయుడు, కొట్టే నరసింహా రెడ్డి, కోరా హరిప్రసాద్, నాయకులు పసుపులేటి విజయకుమార్, ధనంజయులు, కొల్లంగుంట ముని రామిరెడ్డి, కొట్టే ధనుంజయ రెడ్డి, జయచంద్ర నాయుడు, విజయకుమార్ రెడ్డి, జీవరత్నం, కోటీశ్వర రెడ్డి, గరుడాద్రి నాయుడు, సి. రవి ప్రసాద్, బి. గోపి, సురేష్ నాయుడు, చంద్రబాబు, సుగుణమ్మ ఎన్టీఆర్ అభిమాన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News