నేటిసాక్షి,గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): మండలంలోని గుండ్లపల్లిలో టీడీపీ పార్టీ మండల నాయకులు ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్బంగా అయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించినారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండల అడ్ హక్ కమిటీ కన్వీనర్ గుండా పర్శరాం గౌడ్, మల్లయ్య, వెంకటేశం, కొమురయ్య, మల్లేశం రాజు తదితరులు పాల్గొన్నారు.





