నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : చూడటానికి వారు ఉన్నత కుటుంబాలకు చెందిన దంపతులుగా కనిపిస్తూ గంజాయి రవాణా కు పాల్పడుతున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన కిలాడీ దంపతులను మీల్స్‌కాలనీ, డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు మరియు రైల్వే ప్రోటేక్షన్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసారు. ఈ ఘరానా దంపతుల నుండి సుమారు 6 లక్షల రూపాయల విలువ గల 24 కిలోల గంజాయి ప్యాకేట్లతో పాటు రెండు సెల్‌ఫోన్ల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకట రత్నం వివరాలను వెల్లడిస్తూ ఒడిషా రాష్ట్రానికి చెందిన గొగి శంకర్‌దాస్ (39), పూర్ణిమ గొగిదాస్ (30) వీరూ ఇరువురు భార్యభర్తలు ప్రస్తుతం ఈ దంపతులు గుజరాత్ రాష్ట్రం సూరత్ లో నివాసం వుంటున్నారు. కిలాడీ దంపతలు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం ఈ దంపతలు గంజాయిని ఒడిషా నుండి తీసుకవచ్చి సూరత్‌లో విక్రయించడం ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనుకున్నారు. దీనితో నిందితులు గతంలో ఒడిషాలో పరిచయం వున్న ప్రదీప్ అనే గంజాయి స్మగ్లర్ల వద్ద ఈ దంపతులు గంజాయిని కోనుగొలు చేసి రహస్యంగా బ్యాగుల్లో భద్రపర్చి రైలు ద్వారా ముంబాయి మీదుగా సూరత్‌కు తరలించేవారు. ఇదే తరహలో కిలాడీ దంపతులు పలుమార్లు గంజాయిని సూరత్‌కు తరలించారు. ఇదే తరహలో నిందితులు శుక్రవారం మధాహ్నాం కోనార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తూ పోలీసులకు పట్టుబడుతామనే భయంతో నిందితులు వరంగల్ రైల్వే స్టేషన్ లో దిగి మరో మార్గంలో ముంబాయి వేళ్ళేందుకు మూడవ ప్లాట్ ఫారం నుండి బయటికి పోయేందుకు ప్రయత్నిస్తుండగా అదే సమయంలో డ్రగ్స్ కంట్రోల్ టీంతో కల్సి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మీల్స్‌కాలనీ ఎస్.ఐ సురేష్ నిందితులను అనుమానంతో అదుపులోకి తీసుకోని తనీఖీ చేయగా వారి బ్యాగుల్లో గంజాయిని గుర్తించిన పోలీసులు దంపతులను అరెస్టు చేసిన పోలీస్ స్టేషన్‌కు తరలించారని మీల్స్ కాలనీ ఇన్స్‌స్పెక్టర్ తెలియజేసారు.





