Monday, March 23, 2026

అన్నింటిలో కన్నా.. అన్నదానమే గొప్పదానం..!

  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అది శ్రీనివాస్
  • వాసవి సేవాసమితి, మన చారిటబుల్ ట్రస్ట్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన విప్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ (కోక్కుల వంశీ) : అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు అన్నదానం చేయడం ప్రశంసనీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ వాసవి సేవా సమితి, మన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ లో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ… ఎన్నో సంవత్సరాలుగా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు మూడు రోజులపాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయం అని అన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News