నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండలంలోని తోటపల్లి, గాగిల్లాపూర్ గ్రామాలలో గల వద్ద మోయ తుమ్మెద వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతున్న నేపథ్యంలో, పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడానికి వాగు పరిసర ప్రాంతాల్లో కందకం తవ్వించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జె కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇకపై ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు సహకరించాలని, ఇసుక అక్రమ రవాణా నివారణకు ఎవరైనా సమాచారం అందిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు.





