Monday, March 16, 2026

వన మహోత్సవంలో మొక్కలు నాటిన అధికారులు

నేటి సాక్షి, మెట్ పల్లి ప్రతినిధి : వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ జాతీయ రహదారి ఇరు వైపుల, ఆర్డిఓ కార్యాలయం ముందు మరియు లోపల గుల్ మోర్, సరస్వతి మొక్కలు,టేకోమా మొక్కలు నాటి నీరు పట్టడం జరిగింది. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతిరోజు మొక్కలకు నీరు పోసి పిచ్చి గడ్డిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ చెట్లను కటింగ్ చేస్తూ సుందరంగా తీర్చిదిద్దాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి ఒక్కరు ఇంటి లోపల ఖాళీ స్థలంలో మొక్కలు నాటి ఆ మొక్కలకు ప్రతిరోజు నీరు పోయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, నిజాం, అశోక్, నరేష్ హరితహారం సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News