Thursday, April 2, 2026

బిసి, ఎస్సీ బిల్లులు అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం పొందిన సందర్భంగా

  • సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన కేటిదొడ్డి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గద్వాల నియోజకవర్గం కేటిదొడ్డి మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ నందు జెడ్పి మాజ చైర్ పర్సన్,గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సరితమ్మ ఆదేశానుసారం అసెంబ్లీ సమావేశం నందు తెలంగాణ రాష్ట్రంలోని బిసి,ఎస్సీ బిల్లులకు ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ కేటిదొడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల అధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్నికి పాలాభిషేకం నిర్వహించారు.. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో శతాబ్దాల నుంచి ఎదురుచూస్తున్న బిసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదం తెలిపి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదం తెలిపి పార్లమెంటుకు రాష్ట్ర ప్రభుత్వం పంపించే బిల్లును కేంద్ర బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో బిసీ రిజర్వేషన్ బిల్లును,ఎస్సీ వర్గీకరణ ఆమోదం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాతపాలెం ఆనంద్ గౌడ్, ఉమిత్యాల తాయన్న, గుంతబాయి శ్రీను, సుల్తాన్‌పూరం రాజు, యర్సన్ దొడ్డి గోవింద్, రాఘవేంద్ర, సురేష్, తిరుపతి, వెంకటేశ్వర రెడ్డి, కంబయ్య, రామన్ గౌడ్, గోవింద్ రెడ్డి, కొండాపురం చాకలి నరేష్,కర్రెప్ప, వీరేష్, మైబూ, వీరేష్ తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News