Wednesday, April 1, 2026

ఒక్క సిసి కెమెరా 100 పోలీసులతో సమానం

రాం నరసింహ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి
( గుండ ప్రశాంత్ గౌడ్ )

జగిత్యాల జిల్లా అశోక్ కుమార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో మరియు గ్రామంలో ఉన్న ప్రార్ధన మందిరాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని సూచించడంతో గురువారం రోజున ధర్మపురి పట్టణంలోని మౌసల్ల మస్జిద్ లో నాలుగు సీసీ కెమెరాలను ప్రారంభించడం జరిగింది, ఈ సందర్భంగా సీఐ రాం నరసింహారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ ధర్మపురి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భద్రతపరంగా గ్రామాన్ని సురక్షితంగా ఉంచడానికి మరియు ప్రార్థన మందిరాలలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేరాలను అరికట్టే చర్యల్లో భాగంగా అందరూ తమ పరిసర ప్రాంతాల్లో మరియు ప్రార్ధన మందిరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు,ఇట్టి కార్యక్రమంలో ధర్మపురి సిఐ రాం నరసింహ రెడ్డి.ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్ మరియు హెడ్ కానిస్టేబుల్ సలీమొద్దీన్, కానిస్టేబుల్ రమేష్ నాయక్, రాజు పాల్గొన్నారు. ఇట్టి సీసీ కెమెరాల ఏర్పాటులో సహకరించిన అలీమొద్దీన్, జైనోద్దీన్ మరియు ఖుతుబొద్దీన్ మరియు కమిటీ సభ్యులకు సిఐ అభినందనలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News