- సిపిఐ శత వార్షికోత్సవాలు
- మండల కార్యదర్శి కాంతల అంజిరెడ్డి
నేటిసాక్షి,గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్) :
గన్నేరువరం,మండలం కేంద్రం లో వివిధ గ్రామాలలో భారత కమ్యూనిస్ట్ పార్టీ జెండాలు ఎగురావేశారు. ఈ రోజుతో సిపిఐ పార్టీ పుట్టి 99, సంవత్సరాలు పూర్తి చేసుకొని 100.వ సంవత్సరంలో కి అడుగు పెడుతున్న సందర్బంగా పార్టీ నాయకులు కార్యకర్తలు సభ్యులు జెండా ఆవిష్కరించి ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. సిపిఐ పార్టీ ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు ఎన్నెన్నో సమరాలు ఆనాటి నుండి ఇప్పటివరకు అలుపెరగకుండా నిత్యం పోరాటాలు చేస్తూనే ఉంటుందని సిపిఐ పార్టీఅని అన్నారు. భవిష్యత్తులో మరెన్నో పోరాటాలు చేస్తూనే ఉంటుంది అని అన్నారు. సిపిఐ సీనియర్ నాయకులు బోయిని మల్లయ్య, జాలి గోపయ్యకు, పార్టీ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కాంతల అంజిరెడ్డి, సహాయ కార్యదర్శి చొక్కాల శ్రీశైలం, ఘర్షకుర్తి శ్రీనివాస్, మండల నాయకులు బోయిని మల్లయ్య, కూన మల్లయ్య,జాలి గోపయ్య, ఎండీ నయీమ్, పిప్పల కనుకయ్య, కోతి సంపత్, రాపోలు రాజమల్లు, బోయిని తిరుపతి, మోలుగురి ఆంజనేయులు, గాజులు తిరుపతి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

